ప్రైవేట్ హాస్పిటల్స్ లో పని చేసే నర్సులకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలి.నర్సుల హక్కుల కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ తో ప్రభుత్వం చర్చించాలి.తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత.

బంజారా హిల్స్ ఆగస్ట్ 11,(జే ఎస్ డి ఎం న్యూస్)
ప్రైవేట్ హాస్పిటల్స్ లో పనిచేసే నర్సులకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవటం బాధకరమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో తనను కలిసిన ప్రైవేట్ హాస్పిటల్స్ నర్సులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు పెద్ద ఎత్తున ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయని.అయినా ఆయా హాస్పిటల్స్ లో పనిచేసే సిబ్బందికి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదన్నారు. కనీసం వాళ్లకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం సరికాదన్నారు. వెంటనే ఈ విషయంపై ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్
యాజమాన్యాలతో చర్చించి వారికి ఇన్సూరెన్స్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా పనివేళలు, జీతాలు, ఓవర్ టైమ్ వంటి అంశాల్లో తెలంగాణాకు చెందిన ఉద్యోగులను ఇబ్బంది పెడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోని ప్రైవేట్ హాస్పిటల్స్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.ప్రైవేట్ హాస్పిటల్స్ లో పనిచేసే సిబ్బందికి, నర్సులకు తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని ఈ సందర్భంగా కవిత వారికి హామీ ఇచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *