బేగంపేట ఆగస్ట్ 11, (జే ఎస్ డి ఎం న్యూస్) :
మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో మంగళవారం నిర్వహించిన 246వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 161 దరఖాస్తులుఅందాయి.
వాటిలో రెవెన్యూ శాఖకు 42, బీసీ సంక్షేమ శాఖకు 19, మహిళా శిశు సంక్షేమ శాఖకు 19, ప్రవాసి ప్రజావాణికి 02, ఇతర శాఖలకు 79 దరఖాస్తులు అందాయి. సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జి చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్ దరఖాస్తులు స్వీకరించి ఎండార్స్మెంట్ చేసి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏసిపి ఉమేందర్, ఎన్ ఆర్ ఐ సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీం రెడ్డి, సమన్వయకర్త బొజ్జ అమరేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష అభియాన్ లో మండల స్థాయి అకౌంట్స్ అధికారుల విధులను కొనసాగించాలని కోరుతూ పెద్ద ఎత్తున అభ్యర్థులు తరలి వచ్చారు.వారి సమస్యలపై పాఠశాల డైరెక్టర్ నవీన్ నికోలస్ తో మాట్లాడి చిన్నారెడ్డి, విద్యాసాగర్ చర్యలు తీసుకున్నారు.
