చిన్నారుల మానినక శారీరక పరిస్థితి అభివృద్ధిని నిత్యం గమనిస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తూ అభ్యసనానికి సిద్దం చెయ్యాలని మండల విద్యాశాఖాధికారి గురజాల నుబ్బయ్య కోరారు. స్థానిక వికే ఉన్నత పాఠశాలలో మంగళవారం అంగన్ వాడీ టీచర్లకు మూడు రోజుల పాటు జరగనున్న జ్ఞాన జ్యోతి శిక్షణా కార్యక్రమం మంగళవారం ప్రారంభమైనది. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎంఈఓ శిక్షణలో నేర్చుకున్న విషయాలను క్షేత్ర స్థాయిలో అమరు పరచినట్లయితే అంగన్ వాడీలలో ఉత్తమ విద్యతో పాటు సంరక్షణ కూడ అందుతుందని అన్నారు. రిసోర్స్ పర్సన్ అశోక్, శర్మ, సూపర్ వైజర్ నునీతలు అంగన్ వాడీలకు మొదటి రోజు జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమాలలో పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు.


