దాతల విద్యార్థుల అభ్యున్నతికి తమ వంతు చేయూత ఇవ్వటం అభినందనీయమని మండల విద్యాశాఖాధికారి-1 జి సుబ్బయ్య అన్నారు. తాళ్లూరులో ప్రాధమిక పాఠశాల (ఏఏ)లో విద్యార్థులకు మధ్యాహ్నబోజనానికి అవసరమైన వంద ప్లేట్లను తాళ్లూరు చెందిన దాసరి శ్రీనివాస రావు జ్ఞాపకార్థం వారి కుమారుడు దాసరి సాయి కుమార్ బహుకరించారు. సాయి క్రిష్ణ విద్యార్థులకు అవనమైన కాపీ పుస్తకాలు, అభ్యసన సామగ్రిని అందించారు. విద్యాశాఖాధికారి-2 సుధాకర రావు, ప్రధానోపాధ్యాయుడు టి శ్రీనివాన్, ఉ పాధ్యాయురాలు ఎంవీ సుజాత, అనపర్తి సౌమ్య తదితరులు పాల్గొన్నారు.


