తాళ్లూరు మండలంలో ప్రాధమిక, ఉన్నత పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఆయా పాఠశాలల్లో అకడమిక్ ఇన్స్టక్టర్స్ గా పనిచేయుటకు అర్హలైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాశాఖాధికారి – 1 జి నుబ్బయ్య, ఎంఈఓ-2 సుధాకర్ రావులు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు టెట్ అర్హతతో పాటు స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వబడునని చెప్పారు. న్కూల్ అసిస్టెంట్‌కు రూ.10వేలు, స్కూల్ అసిస్టెంట్‌కు 12,500చొప్పున గౌరవ వేతనం ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. 2026 సెప్టెంబర్ నుండి 2027 ఎప్రియల్ 30 వరకు ఎంపికయిన అభ్యర్థులు పనిచేయవలసి ఉంటుందని చెప్పారు. మండలంలో ఒక ఎస్ జీటి పోష్టు ( చింతల పాలెం), వికే జీ హెచ్ ఎస్ .ఏ ( హిందీ) , జెడ్పీహెచ్ఎన్ తురకపాలెంలో ఎస్ .ఏ (బి ఎస్ ), జెడ్పీహెచ్ఎన్ తూర్పుగంగవరం లో ఎస్ .ఏ ( ఎస్ , ఎస్ )లు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 16 నుండి 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.
ఆకడమిక్ ఇన్స్ట్రక్టర్స్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
14
Aug