బేగంపేట ఆగస్టు 15, (జే ఎస్ డి ఎం న్యూస్) :
“స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానీయుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ, యువత దేశాభివృద్ధి లో తమ పాత్రను గుర్తించాలి అని ఎమ్మెల్సీ వాణి దేవి అన్నారు. బేగంపేట బ్రాహ్మణ వాడి స్వామి రామానంద తీర్థ
మెమోరియల్ ప్రాంగణంలో 80 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి జాతీయ జెండాను ఆవిష్కరించి, విద్యార్థులకు “స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానీయుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ, దేశాభివృద్ధి లో తమ పాత్రను గుర్తించాలి” అని అన్నారు.ఈ కార్యక్రమంలో పీవీ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ పీవీ ప్రభాకర్ రావు, సురభి సోలార్ డైరెక్టర్ శేఖర్ మారం రాజు, స్కూల్ ప్రిన్సిపాల్ వాసుకి పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం స్వామి రామానంద తీర్థ మెమోరియల్ మోడల్ స్కూల్ విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్యాలు, నాటికలతో సందడి చేశారు. విద్యార్థుల ప్రదర్శనలు స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించాయి.
