బేగంపేట ఆగస్టు 15,(జే ఎస్ డి ఎం న్యూస్) :
దేశ సాంస్కృతిక విలువలు నిలబెట్టాలనీ,సమాజ అభ్యున్నతి కోసం కృషి చేయాలనీ రిటైర్డ్ డి జి పి రతన్ అన్నారు.తెలంగాణా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ భవనంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.మహాత్మా గాంధీజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రతన్ మాట్లాడుతూ మన జాతీయ నాయకుల త్యాగాలను స్మరించుకున్నారు.వారి సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు మాధవా చారి, గోవర్ధన్ రెడ్డి,సత్యనారాయణ,ప్రభాకర్ రెడ్డి,ఉపాధ్యక్షులు రాజయ్య, నరసింగ రావు తదితరులు పాల్గొన్నారు. చిన్నారులకు మిఠాయిలను పంపిణీ చేశారు.

