బేగంపేట ఆగస్టు 15, (జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట రసూల్ పురా చౌరస్తాలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు బేగంపేట డివిజన్ కాంగ్రెస్ నాయకులు విశాల్ సుధామ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరైన సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డా.కోట నీలిమ మాట్లాడుతూ నాటి స్వాతంత్రం సమరంలో ఎందరో మహాను భావులు ప్రాణ త్యాగాలు చేశారని.వారందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నామన్నారు.
ముందుగా జాతీయ జెండాను ఆమె ఆవిష్కరించారు.అనంతరం చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశాల్ సుధామ్,నసీరుద్దీన్ (అడ్డు),చిరంజీవి ,రాజేందర్, మునీర్ ఖాన్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.


