ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల్లో వసతులను మెరుగు పరిచి ప్రజలకు మెరుగైన సేవలు అందించటమే కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎంపీపీ, ఆనుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ తాటికొండ శ్రీనివాసరావు అన్నారు. తూర్పుగంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ సమావేశం డాక్టర్ మౌనిక ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ, హెచ్ డి ఎఫ్ సి చైర్మన్ తాటికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ పిహెచ్ సి ల మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నదన్నారు. గతంలో, ఆనుపత్రులు పనితీరు నక్రమంగా వుండేది కాదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆనుపత్రుల అభివృద్ధిపై దృష్టి సారించి ఆసుపత్రులకు వచ్చే వారికి మెరుగైన చికిత్సల కోసం అనేక ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. పిహెచ్సీలకు మందుల కొరత, పరీక్షలకు అవసరమైన యంత్ర పరికరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైద్యాధికారి మౌనిక మాట్లాడుతూ హెచ్ డి ఎఫ్ సి నిధులతో ఆసుపత్రి నందు బయోమెడికల్ రూమ్ నిర్మాణం, మోడల్ వైద్యశాల ఏర్పాటుకు అవసరమైన వనతుల కల్పించాలని కోరారు. ఆసుపత్రి ముందు వైపు ఆర్చ్ ఏర్పాటు చేయాలని కోరగా ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, హెచ్ ఈ ఓ చంధ్రశేఖర్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.
