శ్రీ ఉజ్జయిని మహకాళి దేవస్థానము హుండీ ఆదాయం మొత్తం రూ.62,48,167/-

సికింద్రాబాద్ , ఆగస్ట్ 19,(జే ఎస్ డి ఎం. న్యూస్) : శ్రీ ఉజ్జయిని మహకాళి దేవస్థానము హుండీ ఆదాయం మొత్తం రూ.62,48,167/-లు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయం ప్రాంగణంలో ఆషాడ జాతర – 2026 హుండీలు బుదవారము రోజున ఉ.9గం.లకు ఆలయకార్యనిర్వహణాధికారి.జి.మనోహర్ రెడ్డి , ఇన్స్పెక్టర్ . శ్రీదేవి, చైర్మన్ సురిటి కామేశ్వర్ , ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ సురిటి.రామేశ్వర్, ట్రస్ట్ బోర్డ్ మెంబర్లు, భక్తుల సమక్షములో హుండీలు విప్పి లెక్కింపు చేశారు.మొత్తం రూ. 62,48,167/-లు వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి గుత్తా మనోహర్ రెడ్డి తెలియజేశారు. వాటిలో నోట్లు రూ.58,90,416/-లు, కాయిన్స్ రూ.3,57,751/-లు, మొత్తం రూ. 62,48,167/-లు అమ్మవారికి కానుకల రూపంలో వచ్చాయన్నారు. అదే విధంగా మిశ్రమబంగారం.49గ్రా మరియు మిశ్రమ వెండి980గ్రా,500మి.గ్రా వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలు పర్యవేక్షణ వీడియో రికార్డింగ్ తో ఉండే లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఈ ఓ తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *