బేగంపేట ఆగస్ట్ 20(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ విశిష్ట సేవలు అందించారనీ కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి
బండి రమేష్ అన్నారు.దివంగత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు ప్రకాశం నగర్ డివిజన్ పరిధి లోని శ్యామ్ లాల్ బిల్డింగ్ ఎరుకల బస్తీ చౌరస్తాలో డివిజన్ అధ్యక్షుడు దర్గా కరుణాకర్,ఎరుకల సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బండి రమేష్ ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ యువతకు ప్రాధాన్యతనిస్తూ, సాంకేతిక రంగంలో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాజీవ్ గాంధీ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు దర్గా కరుణాకర్ సీనియర్ నాయకులు అమరం శ్రీనివాసరెడ్డి హాజీ టోచర్ , గౌరపల్లి రమేష్ , ఎరుకలు సురేష్ , రమ ,కొండ కిరణ్ , కిషోర్ గౌడ్. శ్యామ్, నరేందర్ మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, కాంగ్రెస్ నాయకులు, యువజననాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


