అంగన్వాడీ సిబ్బందికి మూడు రకాల యాప్ లతో ఇబ్బందులు.సీఎం ప్రజావాణిలో 187 దరఖాస్తులు

హైదరాబాద్ ఆగస్ట్ 25,(జే ఎస్ డి ఎం న్యూస్)
రాష్ట్ర వ్యాప్తంగా విధులునిర్వహిస్తున్న అంగన్వాడీ సిబ్బందికి మూడు రకాల యాప్ లతో అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని, ఆ ఇబ్బందుల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూమంగళవారం సీఎం
ప్రజావాణిలో ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డికి వినతి పత్రాన్నిఅందజేశారు.కేంద్ర, రాష్ట్రాలలో యాప్ లకు
అదనంగా జిల్లాల్లో కలెక్టర్స్ మూడో యాప్ ను
అమలులోకి తెచ్చారని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన చిన్నారెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేశారు. దీంతో అంగన్వాడీ సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో మంగళవారం నిర్వహించిన 250వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 187 దరఖాస్తులు అందాయి.రెవెన్యూ శాఖకు 58 దరఖాస్తులు, బీసీ సంక్షేమ శాఖకు 32, ఆర్థిక శాఖకు 11, ప్రవాసి ప్రజావాణికి 04, ఇతర శాఖలకు 82 దరఖాస్తులు అందాయి. సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్ దరఖాస్తులు స్వీకరించి ఎండార్స్మెంట్ చేసి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏసిపి ఉమేందర్, ఎన్.ఆర్.ఐ. సలహా మండలి చైర్మన్ అంబాసడర్ డాక్టర్ బీ.ఎం. వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీం రెడ్డి, సభ్యులు చెన్నమనేని శ్రీనివాస్ రావు, సమన్వయకర్త బొజ్జ అమరేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *