ఈ నెల 28న ఒంగోలులో రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన – ​చదలవాడ లో రూపుదిద్దుకోనున్న అంతర్జాతీయ ‘రాడిసన్ హోటల్’ కు శంకుస్థాపన – ​స్థానిక ఎమ్మెల్యే బి.ఎన్ విజయ్ కుమార్ , ఏం.ఎల్ సి రాజు ,ప్రజా ప్రతినిధులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 28వ తేదీన ఒంగోలు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామం వద్ద అంతర్జాతీయ స్థాయిలో నిర్మించతలపెట్టిన ప్రతిష్టాత్మక ‘రాడిసన్ హోటల్’ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
​ఈ పర్యటన నేపథ్యంలో మంగళవారం నాడు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను మరియు హోటల్ నిర్మాణ స్థలాన్ని జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు, సంతనూతలపాడు శాసనసభ్యులు బి. ఎన్. విజయ్ కుమార్, ఎమ్మెల్సీ రాజు, మరియు ప్రముఖ నాయకులు కంది రవిశంకర్ సంయుక్తంగా పరిశీలించారు.
​ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు మాట్లాడుతూ​” హోటల్ ‘రాడిసన్’ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందనన్నారు. దీనివల్ల ఒంగోలు మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల యువతకు పెద్ద ఎత్తున ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయనీ ఆయన చెప్పారు. అలాగే ఆర్థిక కార్యకలాపాలు మరింత పుంజుకుంటాయన్నారు.
​మంత్రి పర్యటన నిమిత్తం చేపడుతున్న ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా, ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

​ఈ పరిశీలన కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, నాగులుప్పలపాడు తహసీల్దార్ ప్రవీణ్, ఇతర స్థానిక అధికారులు, నాయకులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *