తక్కువ వ్యయంతో అధిక దిగుబడులు సాధించటానికి ప్రకృతి సాగు పద్ధతులు ఆచరించాలని మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. నాగంబొట్ల పాలెం గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ప్రకృతి సాగు పద్దతులైన ఘన, ద్రవ జీవామృతం, సహజ కషాయ వినియోగం, ఆస్త్రాల వినియోగం, నేల ఆరోగ్య పరిరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ వంటి విధానాలను ఆచరించాలని కోరారు. ఎల్ నిలో ప్రభావం నుండి పంటలను కాపాడుకోవచ్చని చెప్పారు. పంట్ల తోటలు ప్రకృతి సాగు విధానాలను వివరించారు. విఏఏ ప్రియ, ఎఈఓ సుబ్బా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
