వెలుగు కార్యాలయంలో స్వచ్చభారత్ మంత్రి(జీ) పథకంలో మంజూరైన కమ్యూనిటీ పారిశుధ్య భవన సముదాయానికి కేటాయించాల్సిన స్థలాన్ని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, ఎంపీడీఓ అజిత పరిశీలించారు. ఈ పథకంలో రూ.18 లక్షలు మంజూరు కావటంతో మండల కాంప్లెక్స్ లో నముదాయ పరధిలో స్థలాన్ని కేటాయించాలని ఆర్ డబ్ల్యు ఎన్ ఎన్ ఈ నూచించారు. ఈ సముదాయంలో టాయిలెట్స్, స్నానపు గదులు, వాషింగ్ ప్లాట్ ఫాం, వాష్ బేషన్ ఏర్పాటు చేయనున్నారు. కాంప్లెక్స్ పరిధిలో నిరుపయోగంగా ఉన్న వైద్యాధికారి భవనం ప్రక్కన ఉన్న స్థలం అనువైనదిగా గుర్తించారు. ఆ స్థలానికి మండల పరిషత్ అనుమతులు ఇవ్వాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, ఎంపీడీఓ అజితకు సూచించారు. మండల సమాఖ్య అధ్యక్షురాలు సుజాత, ఆర్ డబ్ల్యు ఎన్ ఎఈ వాలి పాల్గొన్నారు.
