బేగంపేట ఆగస్ట్ 26,(జే ఎస్ డి ఎం న్యూస్)
ఎన్నో సంవత్సరాల నుంచి శ్యామ్ లాల్ బిల్డింగ్ బస్తీ వాసులకు నీరందించిన చేతి పంపు (బోరు)గడచిన కొద్ది రోజులుగా పని చేయక పోవడంతో బస్తీ వాసులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.బస్తీలో ఎవరైనా చనిపోయిన సమయంలో ఈ బోరు వద్ద కు వచ్చి నీటిని స్థానికులు వినియోగించుకుంటారు.అయితే గత కొన్ని రోజులుగా ఈ బోరు పాడై పోవడంతో స్థానికంగా ఎవరైనా చనిపోతే నీటికి తీవ్ర ఇబ్బందిగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు బోరు కు వీలైనంత త్వరగా చేతి పంపు రిపేర్ చేయించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
