రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తు భద్రత మరియు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు

ఈ నెల 31వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయనున్న సందర్భంగా, దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద ముఖ్యమంత్రి పర్యటన మరియు బహిరంగ సభా ఏర్పాట్లను మార్కాపురం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, తో పాటు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ,మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మరియు ఇతర అధికారులతో కలిసి ముందస్తు భద్రత సమన్వయం ద్వారా బందోబస్తు ఏర్పాట్లు, వాహనాల రూట్ మార్గమును పరిశీలించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగే హెలిప్యాడ్ ప్రాంతం, బహిరంగ సభా స్థలం, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు, ఫీడర్ కెనాల్, జలహారతి జరిగే ప్రదేశాలను పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు, సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గాన్ని కూడా పరిశీలించారు. బందోబస్తు, భద్రతా చర్యలపై పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ గారు పలు సూచనలు చేశారు.

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించి, తగిన చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ సూచించారు. హెలిప్యాడ్ ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టడంతో పాటు, ప్రజా వేదిక మరియు ఫీడర్ కాలువ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ఇతరుల వాహనాలకు వేర్వేరు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, మార్కాపురం ఓఎస్డి(అడ్మిన్) నవజ్యోతి మిశ్రా , మార్కాపురం డి.ఎస్.పి యు. నాగరాజు,ఎర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ జి.ఏరిక్షన్ బాబు, ఎస్ బి ఇన్స్పెక్టర్ యం. శ్రీనివాసరావు వైపాలెం సీఐ కె అజయ్ కుమార్, రెవిన్యూ అధికారులు, వెలిగొండ ప్రాజెక్టు అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *