సికింద్రాబాద్ ఆగస్టు 30(జే ఎస్ డి ఎం న్యూస్)
నగరంలో రోడ్ల పక్కన, ఫుట్‌పాత్‌లపై తలదాచుకుంటున్న నిరాశ్రయులకు ‘స్కై ఫౌండేషన్’ అండగా నిలిచింది. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో సంచార జీవనం సాగిస్తున్న కుటుంబాలు, అనాథలు, వృద్ధులకు దుస్తులతో పాటు బిస్కెట్ ప్యాకెట్లు, తాగునీటి ప్యాకెట్లను అందజేశారు. కనీస అవసరాలు తీరక ఇబ్బందులు పడుతున్న తమకు ఈ సహాయం అందించడం ఎంతో ఊరటనిచ్చిందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ఫౌండేషన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. పేదలు, ఆపన్నులను ఆదుకోవడమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వై. సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఓ. పావని తదితరులు పాల్గొన్నారు.

