21 మంది పోలీస్ అధికారులకు ఘన వీడ్కోలు..రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేత.

హైదరాబాద్ ఆగస్ట్ 31,(జే ఎస్ డి ఎం న్యూస్) :
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 42 ఏళ్ల పాటు సుదీర్ఘంగా, అంకితభావంతో సేవలందించి పదవీ విరమణ పొందిన 21 మంది పోలీస్ అధికారులకు సిటీ పోలీస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు, సన్మాన కార్యక్రమం జరిగింది.వయోపరిమితి కారణంగా సర్వీసు పూర్తి చేసుకున్న 11 మంది సబ్-ఇన్‌స్పెక్టర్లు, 9 మంది అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్లు, ఒక హెడ్ కానిస్టేబుల్‌కు వీడ్కోలు పలికారు. సిటీ పోలీస్
కమిషనర్ తరఫున అడిషనల్ సీపీ (క్రైమ్స్ & సిట్) ఎం. శ్రీనివాస్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై పదవీ విరమణ పొందిన అధికారులను శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలతో పాటు సొసైటీ తరఫున రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా అడిషనల్ సీపీ
ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ, పదవీ విరమణ తర్వాత చేతికందే ఆర్థిక నిధుల విషయంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అధిక వడ్డీల పేరుతో ఆశ చూపే మోసపూరిత పథకాల బారిన పడకుండా, తమ నిధులనుసురక్షితమైన ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థల్లోనే డిపాజిట్ చేసుకోవాలనిస్పష్టం చేశారు.ప్రారంభమయ్యే ఈ ‘సెకండ్ ఇన్నింగ్స్’లో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, కుటుంబ సభ్యులు కూడా వారికి తగిన తోడ్పాటునందించాలని పేర్కొన్నారు. వారి విశిష్ట సేవలకు గుర్తింపుగా పదవీ విరమణ పొందిన అధికారులను ప్రత్యేక ప్రభుత్వ వాహనాల్లో సగౌరవంగా వారి నివాసాలకు చేర్చారు.ఈ కార్యక్రమంలో డీసీపీ (అడ్మిన్) కె. వెంకట లక్ష్మి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏవో) యాదగిరి,జూనియర్ ఏడీవో మహమ్మద్ ఇస్మాయిల్, సొసైటీ ఉపాధ్యక్షులు ఎండీ ఆసిఫ్ ఖాన్, కోశాధికారిజి.ఎం.ఎస్. విక్టర్, డైరెక్టర్లు కె. రత్నకుమారి, ఎ.ఎస్.డి. శాంతి, డి. లక్ష్మణ్ కుమార్, కె. జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *