ప్రధాన రోడ్డుపైనే వ్యాపారాలు…వాహనాల రాకపోకలకు అంతరాయం…

బేగంపేట సెప్టెంబర్ 2,(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట ప్రధాన రోడ్డు చిరు వ్యాపారులకు అడ్డగా మారింది.బేగంపేట లో విమానాశ్రయం ఉండటం నిత్యం ఆంధ్రప్రదేశ్,తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రుల
తో పాటు కేంద్రమంత్రులు ,ప్రతి పక్ష నేతలు,తరచూ బేగంపేట విమానాశ్రయం నుంచి రాక పోకలు సాగిస్తుంటారు.ముఖ్యమంత్రి తో పాటు గవర్నర్ కూడా ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు.ఇలా ముఖ్యమైన వీ వీ ఐ పీ లు, వీ ఐ పీ లు పోలీస్ ఉన్నతాధికారులు ప్రయాణించే ఈ రోడ్డులో ఎక్కడ చూసినా చిరు వ్యాపారులు వ్యాపారాలు సాగిస్తున్నారు.దీంతోవారి వద్ద కొనుగోలు చేసేందుకు వచ్చిన వాహనదారులు తమ వాహనాలను రోడ్లపైనే నిలిపి వేస్తుండటంతో తరచూ ఈ రోడ్డు
లో ట్రాఫిక్ జామ్ అవుతుంది.ఇదే సమయంలో ప్రధాన రోడ్డుకు అనుకుని వున్న పాఠశాల కు ఉదయం సాయంత్రం విద్యార్థులను వదిలి పెట్టీ తీసుకెళ్లేందుకు వచ్చే వాహనాలతో కూడా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది.ప్రధాన రోడ్డు కు అనుకుని వున్న పలు హోటళ్లు,వ్యాపార కేంద్రాలకు కూడా పార్కింగ్ లేక పోవడంతో ఎక్కువ వాహనాలు ప్రధాన రోడ్డుపైనే పార్కింగ్ చేస్తుండటం ఈ మార్గంలో ట్రాఫిక్ జాం తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనదారులు వాపోతున్నారు.ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు వీ వీ ఐ పీ, వీ ఐ పీ ల భద్రతను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకుని ట్రాఫిక్ జామ్ లేకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు,వాహనదారులు కోరుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *