జిల్లా ప్రజలకు ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తూ అండగా నిలుస్తున్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని విమర్శించే స్థాయి ఎమ్యేల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కి
లేదని మండలటీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వరెడ్డి విమర్శించారు. తాళ్లూరులో సమావేశం ఏర్పాటు చేసి ఎంపీ మాగుంటపై బూచేపల్లి చేస్తున్న ఆరోపణలను టీడీపీ నేతలు ఖండించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో పచ్చిమ ప్రాంత రైతులు పడ్డ కష్టాలను పరి ష్కరించటంలో అప్పటి సిఎం జగన్ విఫలమయ్యాడని ఆవేదనతో మాట్లాడగా దానిని బూచేపల్లి తప్పుపడుతూ మాట్లాడం విడ్డూరంగా వుందన్నారు.2019లో వైసీపీ వల్లే ఎంపీగా మాగుంట గెలిచాడని బూచేపల్లి మాట్లాడం బావ్యంగా లేదన్నారు. బూచేపల్లి చిన్నపిల్లోడిగా వున్నప్పుడే మాగుంట ఎంపీగా వున్నాడన్న విషయాన్నిగుర్తుచేసుకోవాలన్నారు. వైసీపీ వాళ్లు ఎదేదో మాట్లాడుతున్నారని, మాగుంట
కుటుంబాన్ని విమర్శించటం అంటే అంతకన్నా నీచం మరోకటి వుండదన్నారు. రాష్ట్ర నాటక అకాడమి కార్పోరేషన్ డైరెక్టర్ బి.ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ మాగుంట వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభు త్వంలో ఎంపీగా ప్రయత్నించగా కార్యరూపం దాల్చకపోవటంతో ప్రస్తుత సీఎం చం ద్రబాబు రైతుల పక్షాన నిలిచి సార్ధకత చేశాడన్న ఆవేదనతో మాట్లాడిన మాట లకు బూచేపల్లి ఏదో మాట్లాడం బావ్యం కాదన్నారు. ఎంపీ మాగుంట కుటుంబం అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలకు తెలుసునన్నారు. బూచేపల్లి వెన్నుపోటు అంటూ చంద్రబాబును మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు వుంద న్నారు. తనకు అండగా నిలిచిన తల్లిని, చెల్లిని ఇంటినుండి గెంటి వేసి, బాబాయిని గొడ్డలితో హతమార్చిన జగన్ వెన్నుపోటుదారుడు ఔనోకాదో చెప్పాలని
బూచేపల్లిని నిలదీశారు. డీబీసీవైస్ చైర్మన్ తూము శివనాగిరెడ్డి మాడ్లాడుతూ వైసీపీ నేతులు ఎంపీమాగుంటను మాట్లాడటం సిగ్గుమాలినపని అన్నారు.ఇప్పుడు ఎంపీమాగుంటను విమర్శిస్తున్న వారంతా ఆయన సొమ్ము తిని ఎదిగిన వారేనన్నారు. వైసీపీ నేతలు ఎంపీ మాగుంటను విమర్శిస్తే భవిష్యత్తులో పుట్టగతులు కూడ ఉండవన్నారు.. ఈ సమావేశంలో వైస్‌ఎంపీపీ ఐ.వెంకటేశ్వరెడ్డి, మండలతెలుగు రైతు అధ్యక్షులు కైపు రామకోటిరెడ్డి, రాష్ట్ర తెలుగు యువతనాయకులు గొల్లపూడి వేణుబాబు, క్లస్టర్ ఇంచార్జి రాచకొండ వెంకట్రావు, టీడీపీ నాయ కులు ఐ.సుబ్బారెడ్డి, ఆగోలు సుబ్బారావు,వడ్డెంపూడి సుధాకర్ తదితరులు పాల్గొ న్నారు.
