వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిని విమర్శించే స్థాయి తాళ్లూరు మండల టిడిపి నాయకులకు లేదని, బూచేపల్లిని మాగుంటను విమర్శించే స్థాయి లేదనటం వారి అజ్ఞానానికి నిదర్శమని వైసీపీ నాయకులు అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. పేదల పెన్నిధిగా జిల్లాలో పేరోంది, స్వతంత్ర ఎమ్మెల్యేగా, ఎమ్మెల్యేగా, జెడ్పీ చైర్మన్గా ఎన్నికైన ఏకైక కుటుంబం బూచేపల్లి కుటుంబం అని వివరించారు. దశాబ్దాలుగా పేదల సేవలో తరిస్తూ ఏనాడు ప్రజలకు అందుబాటులో లేకుండా లేరని, నిత్యం బూచేపల్లి కుటుంబం ప్రజలతో మమేకమైన కుటుంబం అన్ని విషయం జిల్లాలో అందరికి తెలుసు అని అన్నారు. కేవలం వైఎన్ ఆర్ దయాదాక్షణ్యాలతో, వైఎన్ జగన్ మోహన్ రెడ్డి ఎంపీ టికేట్ ఇస్తే గెలిచి నేడు ఆయననే నిందించటం అవకాశ వాద రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు.
నాడు మాగుంట సుబ్బ రామ రెడ్డి గారి జిల్లా లో విద్యాభివృద్ధికి, అభివృద్ధికి ఎంతో కృషి చేసారని తర్వాత మాగుంట వారసత్వాన్ని నిలబెడతానని వచ్చిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎన్నికలకు ఒక పార్టీ మారుతూ నేడు ఆయన స్థానాన్ని, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి వైసీపీ అధ్యక్షుడిని నానా విధాలుగా, కులాన్ని రేచ్చగొట్టే విధంగా, తక్కువ చేసే విధంగా మాట్లాడటం ఎంత వరకు నమంజనమని ఆయన విజ్ఞతకే వదిలేస్తుస్తున్నామని అన్నారు. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూధన రెడ్ది, పార్టీ మండల అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి రాష్ట్ర ఇంటలిజేన్స్ వింగ్ కార్యదర్శి ఐవీ సుబ్బా రెడ్డి, యూత్, బీసీ, ఎస్సీ వింగ్ అధ్యక్షులు విష్ణు, వెంకట రావు, ప్రభుదాస్, ఐ బ్రహ్మా రెడ్డి, మాజీ సర్పంచి వలి తదితరులు పాల్గొన్నారు.
