కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ను ప్రజలు గద్దె దించే రోజులు దగ్గర పడ్డాయి..కాంగ్రెస్ 1000 రోజుల దగా పై బీఆర్ఎస్ సమరభేరి.లో బేగంపేట మాజీ కార్పొరేటర్ టి మహేశ్వరి శ్రీహరి.

బేగంపేట సెప్టెంబర్ 5,(జే ఎస్ డి ఎం న్యూస్) :
కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ను ప్రజలు గద్దె దించే రోజులు దగ్గరపడ్డాయని బేగంపేట మాజీ కార్పొరేటర్ టి మహేశ్వరి శ్రీహరి ఘాటుగా వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ 1000 రోజుల దగా పై బీఆర్ఎస్ సమరభేరి లో భాగంగా శనివారం ప్రకాశం నగర్ జంక్షన్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బేగంపేట మాజీ కార్పొరేటర్ టి మహేశ్వరి శ్రీహరి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ6 గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి, ‘బాకీ కార్డు’ లతో ప్రతి ఒక బస్తీ మరియు కాలనీ ప్రజల కి తెలియజేయలని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ల పిలుపు మేరకు డివిజన్ పరిధిలో రెండవ రోజు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కానీ తులం బంగారం వంటి ఎన్నో హామీలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ మోసాన్ని ప్రజలు ఇప్పటికే గుర్తించారని ఆమె పేర్కొన్నారు.ఈ నిరసన కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు టి.శ్రీహరి,డి.వి.నరేందర్ రావు నాయి,శేఖర్,శ్రీనివాస్ గౌడ్,రాగా నాగరాజ్ గౌడ్, జాండ్ల కృష్ణ,బంగారి శ్రీను, మహిళ లు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *