కుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 6,(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
ప్రజలకు అత్యాధునిక దంత వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో మైత్రి దంత వైద్యశాల ను ఈ ప్రాంతంలో అందుబాటులోకి తీసుకు వచ్చారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి వివేకానంద అన్నారు.ముందుగా ఆయన ఆసుపత్రింజ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వైద్యశాల నిర్వాహకులు మాట్లాడుతూ, దంత సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స అందించడంతో పాటు, అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన దంత వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఈ శాఖలో దంత పరీక్షలు, పళ్ల శుభ్రత, రూట్ కెనాల్ చికిత్స, దంత ఇంప్లాంట్లు, పళ్ల అమరిక, పిల్లల దంత వైద్యం తదితర సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైద్యులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, స్థానికులు, వైద్యశాల సిబ్బంది హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
