బేగంపేట సెప్టెంబర్ 8,(జే ఎస్ డి ఎం న్యూస్):
బేగంపేట లో బీ ఆర్ ఎస్ నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణం వద్ద బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన దురుసు ప్రవర్తనపై బీ ఆర్ ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి.ఈ నేపధ్యంలో వారిని పోలీసులు గృహ నిర్బంధం చేశాయి. బీ ఆర్ ఎస్ నాయకులు,శ్రేణులపై పోలీసులు నిఘా ఉంచి వారు ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు.అయితే ఈ నిర్బంధంపై బీ ఆర్ ఎస్ శ్రేణులు భగ్గు మంటున్నాయి. ఈ సందర్భంగా బేగంపేట బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు టి.శ్రీహరి ని కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు.ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కే సి ఆర్ నాయకత్వంలో కే టి ఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన బీ ఆర్ ఎస్ ఉద్యమాల తో ఎంతో ఎత్తుకు ఎదిగి 10 సంవత్సరాలు పాటు ప్రజలకు అనేక అభి వృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అందించిందన్నారు.అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీ బీ ఆర్ ఎస్ పార్టీ నీ చూసి భయపడుతుందని,ఇలాంటి నిర్బంధాలకు,కేసులకు బీ ఆర్ ఎస్
నాయకులు,కార్యకర్తలు భయపడరని ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని శ్రీహరి తెలియ జేశారు.

