ప్రజా ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కారించాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు -పోలీస్”ప్రజా సమస్యల పరిష్కార వేదిక”( మీకోసం) కార్యక్రమంకు 100 ఫిర్యాదులు

ప్రకాశం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను జిల్లా ఎస్పీ , పోలీస్ అధికారులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను పూర్తిగా తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును చట్టపరిధిలో సమగ్రంగా పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని బాధితులకు ఎస్పీ గారు భరోసా కల్పించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అనంతరం ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి, ‘మీకోసం’ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఫిర్యాదులపై చట్టప్రకారం సమగ్ర విచారణ జరిపి, ఫిర్యాదుదారులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేకంగా వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేనటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లో, సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాలలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్కువ భూ వివాదాలు, కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేధింపులు, చీటింగ్/జాబ్ ఫ్రాడ్ మరియు ఇతర సమస్యల గురించి ప్రజా పిర్యాదులు వచ్చాయి.

ఈ కార్యక్రమంలో ఒంగోలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ హాజరత్తయ్య, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జున రావు, వివిపాలెం ఎస్సై ప్రేమ్ కుమార్, ప్యానెల్ అడ్వొకేట్ బి.బాలాజీ సింగ్, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై యాస్మిన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *