హైదరాబాద్, సెప్టెంబర్ 11, (జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర విభాగం మరియు ఎకో-క్లబ్ ఆధ్వర్యంలో, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) సహకారంతో “Clay to Celebration – Eco-Friendly Ganesha Making Competition and Idol Distribution కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి టి జి పి సి బి సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి. నాగేశ్వర్ రావు ముఖ్య అతిథిగా, FICCI ప్రెసిడెంట్ సీతా రెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. పద్మావతి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని, వినాయక చవితి సందర్భంగా పర్యావరణహిత మట్టి విగ్రహాలనువినియోగించాలని సూచించారు.వైస్ ప్రిన్సిపాల్ డా. ఎన్. మృదుల మరియు IQAC కోఆర్డినేటర్ డా. టి. ఆనీ షిరాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వృక్షశాస్త్ర విభాగాధిపతి మరియు ఎకో-క్లబ్ కన్వీనర్ డా. కె. ఉషా రాణి కార్యక్రమం ఉద్దేశాలను వివరించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలు, రసాయన రంగుల వినియోగం వల్ల నీటి వనరులకు కలిగే నష్టాన్ని వివరిస్తూ, సహజ మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలనువినియోగించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని తెలిపారు.
ఈ సందర్భంగానిర్వహించిన ఎకో-ఫ్రెండ్లీ గణేశ విగ్రహాల తయారీ పోటీలో విజేతలకు FICCI ప్రెసిడెంట్ సీతా రెడ్డి బహుమతులను అందజేశారు. అనంతరం అతిథులు కళాశాల సిబ్బంది, విద్యార్థులకు పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.పండుగ సంప్రదాయాలనుకొనసాగిస్తూనే పర్యావరణాన్ని పరిరక్షించాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది. “మట్టి వినాయకుడు – పర్యావరణానికి రక్షకుడు” అనే సందేశంతో విద్యార్థుల్లో పర్యావరణ బాధ్యత, సుస్థిర జీవన విధానాల పట్ల
అవగాహనపెంపొందించారు.
ఈ కార్యక్రమాన్ని డా. కె. ఉషా రాణి, బోటనీ విభాగాధిపతి & ఎకో-క్లబ్ కన్వీనర్ పర్యవేక్షణలో, ఎకో-క్లబ్ సభ్యులు డా. ఆర్. స్నేహ, డా. కె. వెంకటేశ్వర్లు, డా. రజితశ్రీ, డా. శాంతి కళ, డా. నందిని, డా. జయలక్ష్మి కుమారి జ్యోతి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు.
