స్థానిక సంస్థల ఎన్నికలలో సోషల్ మీడియా కంటెంట్ పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి – జిల్లా వ్యయ పరిశీలకులు (ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్) శ్రీ వివేక్

జిల్లాలోని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లతో బుధవారం ఒంగోలు కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ప్రకాశం జిల్లా వ్యయ పరిశీలకులు వివేక్ ప్రత్యేక పర్యవేక్షణ సమావేశాన్ని నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
 ​ఈ సమావేశంలో జిల్లా వ్యయ పరిశీలకులు   వివేక్    మాట్లాడుతూ ....  ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ తదితర ప్లాట్‌ఫామ్‌లలో ప్రచురించే ప్రతి పోస్ట్, రీల్, వీడియో మరియు కంటెంట్‌పై కమాండ్ కంట్రోల్ రూమ్‌లోని మీడియా సర్వైలెన్స్ బృందాలు నిరంతరం ప్రత్యేక నిఘా ఉంచుతున్నాయని తెలిపారు. కులాలు, మతాలు, వర్గాల మధ్య విభేదాలు రేకెత్తించేలా గానీ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా గానీ, అభ్యర్థుల వ్యక్తిగత ప్రతిష్టను భంగపరిచేలా గానీ ఎటువంటి వివాదాస్పద కంటెంట్‌ను తయారు చేయడం లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేయరాదని ఆయన ఖరాకండిగా హెచ్చరించారు.

​ఈ సందర్భంగా ఎన్నికల వ్యయ నియమావళి గురించి వివరిస్తూ, రాజకీయ పార్టీలు లేదా పోటీ చేసే అభ్యర్థుల తరఫున సోషల్ మీడియా వేదికగా చేసే ప్రచారాలు, చెల్లింపుల కంటెంట్ (Paid Promotions, Sponsored Content), బ్రాండ్ కొల్లాబరేషన్లు అన్నీ కూడా నేరుగా అభ్యర్థుల ఎన్నికల వ్యయం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు. ఇన్‌ఫ్లూయెన్సర్లు పొందే ప్రచార రుసుములను షాడో అబ్జర్వేషన్ రిజిస్టర్‌లో నమోదు చేస్తామని, వీటిని పారదర్శకంగా ఎన్నికల అధికారులకు వెల్లడించాల్సి ఉంటుందని గుర్తుచేశారు. అంతేకాకుండా, అభ్యర్థుల ప్రచార సంబంధ ప్రకటనలు లేదా వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మోనిటరింగ్ కమిటీ (MCMC) నుంచి ముందస్తు అనుమతి పొంది ఉండాలని ఆయన వివరించారు.స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో, స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగడానికి సోషల్ మీడియా ప్రతినిధులు మరియు క్రియేటర్లు పూర్తి సహకారం అందించాలని వివేక్ కోరారు.

​ఈ సమావేశంలో జిల్లా ఎక్స్పెండేచర్ మానిటరింగ్ కమిటీ నోడల్ అధికారి తిరుపతయ్య,తదితర అధికారులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *