ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ -ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

తాళ్లూరు: మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో బాగంగా ఎంపీటీసీల నామినేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైనది. అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు కావలసిన ఏర్పాట్లను చేసారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు నామినేషన్ ప్రక్రియను బుధవారం అకస్మికంగా తనిఖీ నిర్వహించారు. హెల్పే డెన్స్ను పరిశీలించి తగిన సూచనలు చేసారు. ఎన్నికల నియమావళి ఖచ్చితంగా పాటించాలని, గుంపులు గుంపులుగా జనాలు కూడకుండా చూసుకోవాలని, వంద మీటర్ల పరధిలో నిబంధనలు అమలు చేసే విధంగా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులకు, పోలీసులకు సూచించారు. ఎంపీడీఓ అజిత ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏర్పాట్లను గురించి కలెక్టర్కు వివరించారు. ఆర్జే డి దేవ సహాయం, ఎఈఆర్డీఓలు ఎంపీడీఓ అజిత, తహసీల్దార్ రమణా రావు, ఎంఈఓ సుబ్బయ్య, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస రావు, డీఎస్పీ శ్రీధర్, సీఐ కమలాకర్, ఎస్సై మల్లిఖార్జున రావు, గ్రామ కార్యదర్శి వెంకటాద్రి, స్వర్ణ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మొదటి రోజు నామినేషన్లు ఏమి లేనట్లు ఎంపీడీఓ అజిత తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *