జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎన్నికల వ్యయానికి సంబంధించి అభ్యర్థులు పాటించవలసిన నియమ నిబంధనలు, అధికారులు తీసుకోవలసిన చర్యలపై ఒంగోలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో సమీక్షా సమావేశం నిర్వహణ

జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎన్నికల వ్యయానికి సంబంధించి అభ్యర్థులు పాటించవలసిన నియమ నిబంధనలు, అధికారులు తీసుకోవలసిన చర్యలపై ఒంగోలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల పరిశీలకులు హెప్సిబా రాణి మరియు ఎన్నికల వ్యయ పరిశీలకులు శ్రీ పి. వివేక్ జిల్లాలోని మున్సిపాలిటీలకు నియమించబడిన సహాయ ఎన్నికల పరిశీలకులు, అకౌంటింగ్ టీమ్స్, FST, SST, VST టీమ్స్ మరియు జిల్లా ఎన్నికల వ్యయ మానిటరింగ్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా వ్యయ పరిశీలకులు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మరియు UPI ట్రాన్సాక్షన్స్ పై ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకుని నిశితంగా మానిటర్ చేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ గారిని మరియు EEM నోడల్ ఆఫీసర్ శ్రీ తిరుపతయ్య గారిని ఆదేశించారు.

ఈ సమావేశానికి జిల్లా కో-ఆపరేటివ్ అధికారి, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మరియు ఇతర మున్సిపాలిటీల అసిస్టెంట్ ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్స్, అకౌంటింగ్ టీమ్స్, FST, SST నోడల్ అధికారులు హాజరయ్యారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *