శ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి దేవాలయంలో శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం.

బేగంపేట అక్టోబర్ 19, (జేఎస్ డీ ఎమ్ న్యూస్ ) :
బేగంపేట శ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి దేవాలయంలో సోమవారం అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో దర్శనం ఇవ్వడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలించారు. అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో
వి ఎన్ వి సత్యనారాయణ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్,చైర్మన్ చెక్కల సుభాష్ ముదిరాజ్ లు ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. వివిధ రకాలైన పూలతో సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు పూజలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాల వితరణ గావించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *