తెలంగాణ సాంస్కృతికి ప్రత్యేకంగా నిలిచే పండుగ బతుకమ్మ పండుగ ఎమ్మెల్యే తలసాని….

బేగంపేట అక్టోబర్ 19(జే ఎస్ డీ ఎమ్ న్యూస్ ) :
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే పండుగ బతుకమ్మ పండుగ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బతుకమ్మ వేడుకలలో భాగంగా ఆదివారం రాత్రి నెక్లెస్ రోడ్ లోని కర్బలా మైదానంలో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు వేలాది మంది మహిళలు తీరొక్క పూలతో పేర్చినబతుకమ్మలతో కర్బలా మైదానం కు వచ్చారు. బతుకమ్మ పాటలు,ఆడపడుచుల ఆటలతో నెక్లెస్ రోడ్ పరిసరాలు ఎంతో కోలాహలంగా మారాయి. పాటలకు ధీటుగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మహిళలతో కలిసి బతుకమ్మ, దాండియా ఆడారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలో కన్నా విభిన్నంగా మాస్ డ్యాన్స్ తో అదరగొట్టారు. మహిళలు, యువతులు సైతం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి స్టెప్పులు వేశారు. రంగురంగుల లైట్ల వెలుతురులో, బతుకమ్మ, పోక్ సాంగ్స్ కు అనుగుణంగా మహిళలు, యువతులు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా అర్ధరాత్రి దాటే వరకు బతుకమ్మను ఆడారు. వేడుకలలో మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, టి. మహేశ్వరి, బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, వెంకటేషన్ రాజు, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, గందే నాగులు, కిషోర్, శ్రీహరి, కోటేశ్వర్ గౌడ్, భువనగిరి కిరణ్ గౌడ్, రాంమోహన్ యాదవ్, ధరం చౌదరి, శ్రీకాంత్, టీనా గౌడ్, ఆరీఫ్, కొత్తూరు వెంకట్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *