ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎంపీటీసీ, జడ్పిటిసి, మేయర్, చైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ప్రసార మాధ్యమాల ద్వారా ఏవైనా
ప్రకటనల విడుదలకు, పాంప్లెట్లు వంటివి ముద్రించేందుకు ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. ఈ ప్రకటనల్లోని సారాంశాన్ని ముందుగా జిల్లాస్థాయిలో ప్రకాశం భవనంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎం.సి.ఎం.సి.) పరిశీలించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం ప్రకటనలను రెండు పెన్ డ్రైవ్‌లలో నిక్షిప్తం చేసి సమర్పించాలన్నారు. ఎంసీఏంసి అనుమతి మేరకే ప్రచార నిమిత్తం ప్రకటనలను అభ్యర్థులు విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. ఎంసీఎంసీ అనుమతి లేకుండా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకునే అభ్యర్థులపై ఎన్నికల ప్రవర్తన నియమావళి మేరకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
మరిన్ని వివరాల కోసం 9121215351 / 9121215293 నంబర్లను సంప్రదించగలరు.

Save or share this story as a newspaper-style Epaper Clip: