హైదరాబాద్ అక్టోబర్ 27 జె ఎస్ డి ఎం న్యూస్ )
విద్యుత్ సరఫరా వ్యవస్థలో అత్యంత కీలకమైన ట్రాన్స్ఫార్మర్ల వద్ద చెత్తాచెదారం వేయడం తగదని విద్యుత్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రతి వారం నిర్వహించే ‘ప్రజాబాట’ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ సర్కిల్, ప్యారడైజ్ డివిజన్ పరిధిలోని జనరల్ బజార్ సెక్షన్లో ప్రత్యేక అవగాహన సదస్సును జనరల్ బజార్ సెక్షన్ ఏఈ కాసం రవి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక విద్యుత్ సిబ్బంది, జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏడీఈ శివదుర్గాప్రసాద్, ఏఈ కాసం రవికుమార్ పాల్గొని స్థానికులకు పలు సూచనలు చేశారు.ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల తరచూ షార్ట్ సర్క్యూట్లు జరిగి అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఏఈ రవికుమార్ తెలిపారు. అంతేకాకుండా విద్యుత్‌లో అంతరాయం ఏర్పడినప్పుడు ఫ్యూజులు మార్చడానికి, మరమ్మతులు చేపట్టడానికి వెళ్లే లైన్మెన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎవరూ ట్రాన్స్ఫార్మర్ల వద్ద చెత్త వేయకూడదని, నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఏడీఈ శివదుర్గాప్రసాద్, సెక్షన్ సిబ్బంది కోరారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: