సికింద్రాబాద్, అక్టోబర్ 29 (జే ఎస్ డి ఎం న్యూస్ ) :
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైందని, అర్హులైన పట్టభద్రులందరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ కోటా నీలిమ పిలుపునిచ్చారు. గురువారం బన్సీలాల్‌పేట్‌లో సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు ఎంపీ అనిత (అనసూయ) ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నీలిమ మాట్లాడుతూసమాజంలో మార్పు కోసం విద్యావంతులు తమ ఓటు ద్వారా సరైన నిర్ణయంతీసుకోవాలని, కాంగ్రెస్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్‌రెడ్డికి మద్దతుగా నిలిచి ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు జి.ఎల్. రమేశ్‌బాబుతో పాటు నేతలు వి.ఎస్. నారాయణ, డి. శ్రీనివాస్, పాండు గౌడ్, ఆర్. కృష్ణ, రాజశేఖర్, కోయేటి ఆరతి, సి.పి. శంకర్, శ్రీహరి, దుర్గేష్, భాగ్యమ్మ, ఎంపీ సునీల్, కాంతారావు, హరి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: