అయ్యప్ప మాల ధారణ అధ్యాత్మిక క్రతువు…. ఎమ్మెల్యే తలసాని.రామలింగేశ్వర దేవాలయం నుంచి శబరి మల పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే…

బేగంపేట నవంబర్ 1(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
అయ్యప్ప మాలధారణ అనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, అదొక గొప్ప ఆధ్యాత్మిక క్రతువు అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం బేగంపేట లోని ప్రకాష్ నగర్ లో గల శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద 175 మంది అయ్యప్ప స్వాముల బృందం శబరిమల వరకు సాగించే పాదయాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 41 రోజుల పాటు ఎంతో నిష్ఠతో అయ్యప్ప ను పూజించడం ద్వారా ఆత్మశుద్ధి కలుగుతుందని పేర్కొన్నారు. డిసెంబర్ 8 వ తేదీ నాటికి శబరిమల కు చేరుకుంటామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు టి. శ్రీహరి,బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు శేఖర్, ఆరీఫ్, అఖిల్, బంటి, గురు స్వాములు బుచ్చిబాబు, బాలు, చింటు తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *