అణగారిన ప్రజల అభ్యున్నతికి మరియు సామాన్యుని గొంతు వినిపించడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ప్రజలకు అందించిన రోజు ఈ రోజని జిల్లా కలెక్టర్ కలెక్టర్ పి. రాజాబాబు కొనియాడారు.
గురువారం ఒంగోలు పట్టణంలోని స్థానిక హెచ్ సి ఎం జూనియర్ కాలేజీ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి 77వ రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 200 సంవత్సరాల క్రితం భారతదేశ పరాయి పాలనలో ఉన్నదని , స్వాతంత్రం కోసం అనేకులు త్యాగం చేసి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారన్నారు. స్వాతంత్రం ఇచ్చే ముందు బ్రిటిష్ వారు పలు మాటలు అన్నారని ఎందుకు స్వాతంత్రం కోసం పోరాడు పోరాడుతున్నారు మీ దేశంలో విభిన్న కులాలు విభిన్న జాతులు విభిన్న సంస్కృతులు ఉన్నాయని ఐకమత్యం లేదని అన్నారు. ఇప్పుడు స్వాతంత్రం ఇస్తే ఎలా పాలించుకుంటారని కారణం చేత ఎదురు ప్రశ్న వేశారు. అయినప్పటికీ కూడా మా దేశాన్ని మేమే పాలించుకుంటాం ఆ సత్తా మాకు ఉందని స్వాతంత్రం కోసం అందరు పాటుపడ్డారన్నారు. పాలనాపరంగా రాజ్యాంగం అవసరం కాబట్టి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఏర్పాటు చేసి అందరి కృషితో ఆరోజు రాజ్యాంగం రాయడం జరిగింది అన్నారు. ఈ బృహత్తర బాధ్యతను మేధావి అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు అందించారని ఆయన తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పలుదేశాల రాజ్యాంగాలను నిజంగా పరిశీలించి ప్రజలకు సమన్యాయం జరగాలని ఉద్దేశంతోటి ఆర్థిక స్వేచ్ఛ, మత స్వేచ్ఛ , వాక్ స్వాతంత్రం ఉండాలని రాజ్యాంగాన్ని పొందుపరిచారు అన్నారు. వివిధ దేశాల రాజ్యాంగాలను చదివి ఫండమెంటల్ రైట్స్ ని ఏర్పాటు చేశారన్నారు. దేశము ము క్కల ము క్కలుగా 229 ప్రావిన్సులు 70 ప్రెసిడెంట్ ఉండేవని ముక్కలు ముక్కలుగా ఉన్న రాజ్యాన్ని ఏక తాటిపై తెచ్చి పాలనను కొనసాగించాలని రాజ్యాంగాన్ని పొందుపరిచారు అన్నారు. భారత రాజ్యాంగాన్ని వివిధ దేశాలు కూడా నేడు కొనియాడుతున్నారని ఆయన తెలిపారు. ఈరోజు ఒక పండుగ వాతావరణం లో రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతున్నదని ఆయన తెలిపారు. అనంతరం పిల్లల హాజరైన వారిచేత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ, రెవిన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్ నాయుడు, నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ నగేష్ బాబు, మరియు వివిధ సంఘాల నాయకులు దళిత ప్రజా సంఘాల నాయకులు నీలం నాగేంద్రరావు కొమ్ము సుజన్ మాదిగ, బిల్లా వసంతరావు , డివిజన్ కార్పొరేటర్ సొల్లేటి అల్లూరయ్య,చప్పిడి వెంగళరావు , పాట్రా బంగారం తదితరులు పాల్గొన్నారు..



Save or share this story as a newspaper-style Epaper Clip: