గురువారం జిల్లా కలెక్టర్ పి రాజబాబు , ఎన్నికల పరిశీలకులు కెవిఎన్ చక్రధర్ బాబుతో కలిసి స్థానిక కలెక్టరే కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. కామెంట్ కంట్రోల్ రూమ్ ద్వారా పోలింగ్ స్టేషన్లో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను వీడియో సర్వేలను వెబ్ కాస్టింగ్ లను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పలు పోలింగ్ స్టేషన్లసిబ్బందితో మాట్లాడుతూ తగు సూచనలు సలహాలు అందజేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా పారదర్శకంగా జరిగే విధంగా చూడాలని ఆయన సూచించారు. ఎన్నికల కమిషన్ పొందుపరిచిన నియమ నిబంధనలను తూ.చా తప్పకుండా పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ, డిపిఓ అనుపమ పలువురు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: