తాళ్లూరు మండలం లో రబీలో సాగు చేసిన పంటలకు గాను నమోదు చేసిన ఈ- క్రాప్ నమోదుకు సూపర్ చెక్ చేస్తున్నట్లు వ్యవసాయాధికారి ప్రసాదరావు తెలిపారు. బొద్దికూరపాడులో బుధవారం ఈ- క్రాప్ పంట నమోదును పరిశీలించారు. పంట నమోదు వివరాలను ఎటువంటి లోపాలు లేకుండా గ్రామ వ్యవసాయ సహాయకులు నమోదు చెయ్యాలని కోరారు. లోపాలు ఉన్నట్లయితే రైతులు సాంకేతిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. వృద్ధ రైతులు, అనారోగ్యంతో ఉన్న రైతులు, మృతి చెందిన వారి పేర్లపై ఉన్న భూములకు ఈ – క్రాప్ను ఆప్షన్ ఇచ్చిన వెంటనే ఖచ్చితమైన సమాచారంతో నమోదు చెయ్యాలని కోరారు. విఏఏ అజ్మీర్, సుష్మ తదితరులుపాల్గొన్నారు.|
ఈ- క్రాప్ నమోదుపై సూపర్ చెక్
08
Feb