తాళ్లూరు మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం విజిలెన్స్ అధికారులు ఎస్సై జి. నాగేశ్వరరావు, ఎఈ చిరంజీవిలు అకస్మికంగా తనిఖీ నిర్వహించారు. వైద్యశాలలో వైద్యులు అందిస్తున్న సేవల పట్ల రోగులను అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్, ఫార్మసీ, పరిసరాలు పరిశీలించారు. నాడు- నేడు పనులు జరుగుతున్న తీరు, రికార్డులను పరిశీలించారు. నాడు- నేడు పనులు 50శాతం మాత్రమే పూర్తి అయ్యాయని ఇంకా పూర్తి కావల్సి ఉన్న విషయాన్ని గమనించారు. రోగులకు అందుతున్న సేవలు, వైద్యులు అందిస్తున్న సేవల పట్ల రోగులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు విజిలెన్స్ ఎఈ నాగేశ్వరరావు తెలిపారు. వైద్యశాలలో అందుతున్న సేవలను వైద్యాధికారి ఖాదర్ మస్తాన్ బి వారికి వివరించారు.
