భారత రాజ్యాంగం ఉదాత్తమైనది మరియు అత్యున్నత విలువలతో కూడినది. ప్రజలు కుల, మత, భాష, లింగ, ప్రాంత,జాతి మొదలైన తారతమ్యాలు లేకుండా అందరూ సమానమని రాజ్యాంగం పునరుద్గాటించనది. ముండ్లమూరు ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ బి జ్యోతి తెలియజేశారు. కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల నందు ముండ్లమూరు మండల దళిత బహుజన రిసోర్స్ సెంటర్ కమ్యూనిటీ గోపన బోయిన వెంకట్రావు అధ్యక్షతన జనవరి 26వ తేదీన రిపబ్లిక్ దినోత్సవం పురస్కరించుకొని భారత రాజ్యాంగ ఆవశ్యకతపై నిర్వహించిన క్విజ్ పోటీలలో గెలుపొందిన బాలికలకు సర్టిఫికెట్స్ బహుకరణ లో ఆమె మాట్లాడినారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారినీ డాక్టర్ ఎం.జాస్మిని మాట్లాడుతూ బాలికలు చిన్నప్పుడు నుంచి రాజ్యాంగం విలువలు పెంపొందించుకోవడానికి ప్రజలంతా ఒకటే అనే భావన కలిగి ఉండాలని విద్యార్థిలకు ఆమె తెలియజేశారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ జిల్లా కో-ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ ….. భారత రాజ్యాంగంపై క్విజ్ పోటీలను ఏర్పాటు చేసి విద్యార్థినీ లలోఉన్నటువంటి నైపుణ్యాలను వెలికితీయటానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ రచనలను విద్యార్థులకు తెలియజేయటానికి ఇలాంటి క్విజ్ మరియు వ్యాస రచన పోటీలు పిల్లలకు ఎంతో ఉపయోగపడతాయని వారు అన్నారు. డి బి ఆర్ సి కమ్యూనిటీ మొబిలైజర్ జి వెంకట్రావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ ఆవశ్యకతపై నిర్వహించిన క్విజ్ పోటీలలో గెలుపొందిన బాలికలకు సర్టిఫికెట్లు మరియు స్కూల్ కి బెస్ట్ అవార్డుగా ఉపాధ్యాయుల సిబ్బందికి అందించడం జరిగిందని వారు అన్నారు. కస్తూర్బా గాంధీ ప్రత్యేక అధికారిని ఆవుల సునీత మాట్లాడుతూ దళిత బహుజన రిసోర్స్ సెంటర్ స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలు చాలా ఉపయోగకరమైనవని అదే విధంగా భారత రాజ్యాంగం బాలికలకు అర్థమయ్యే రీతిగా బాలల కోసం భారత రాజ్యాంగం ప్రవేశికలను గ్రంథాలయంలో పెట్టడం జరిగినది.హక్కుల అవకాశాల గురించి బాలల కోసం వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ డైరెక్టర్ అల్లడి దేవ కుమార్ కి ప్రధానోపాధ్యాయుల బృందం కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ఉపాధ్యాయురాలు,విద్యార్థులు పాల్గొన్నారు .

