ముండ్లమూరు మండలంలోని మారెళ్ళ గ్రామంలో గల గ్రామ శివారుణ గంగమ్మ పోలేరమ్మ ఆలయాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. పూజారి ఉప్పుటూరి పిచ్చయ్య శాస్త్రి ఆధ్వర్యంలో శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమం శాస్త్ర యుక్తంగా గ్రామ పెద్దల సమక్షంలో నిర్వహించారు. గ్రామంలోని మహిళలు చిన్నారులు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు ఐక్యంగా గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దేవాలయాల స్థలదాత కోనంకి ఖాజావలని గ్రామస్తులు అభినందించారు. దేవాలయ కమిటీ ఏర్పాటు చేశారు. వారిలో కోనంకి నరేంద్ర. వల్లం రెడ్డి లక్ష్మి రెడ్డి. సన్న బోయిన ఆదినారాయణ. చిరుమామిళ్ల చిన అంజయ్య. చొప్పరపు మల్లికార్జున. షేక్ ఆంజనేయులు. చిరుమామిళ్ల సుబ్బారావు. మేకల కోటిరెడ్డి. పూరి మెట్ల పేరయ్య లను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.


