గ్రామాలలో పేద నిరుపేదల కోసం ప్రభుత్వం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ ఫిజీషియన్ తో వైద్య సేవ లు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి సిహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మండలంలోని మారళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల నాయుడుపాలెం గ్రామంలో గల డాక్టర్ వైయస్సార్ హెల్త్ క్లినిక్ నందు శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లకుండా ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి మంచి వైద్యం చేయించుకోవాలన్నారు. ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో 104 వాహనం ద్వారా వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిబిరంలో 110 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అందులో బాలింత లు .గర్భిణీలు. బీపీ .షుగర్ . జలుబు. దగ్గు .జ్వరం .ఉన్నవారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఎస్ కే యం యం సుభాని. ఏఎన్ఎం శిరీష. అల్లూరమ్మ తదితరులు పాల్గొన్నారు.
వైయస్సార్ హెల్త్ క్లినిక్ ల వద్ద వైద్య సేవలు
10
Feb