విద్యార్థి విట్సన్ పాల్ ను పరామర్శించిన డీఈవో

ముండ్లమూరు మండలంలోని మారెళ్ళ పంచాయతీ పరిధిలోని గంగన పాలెం కు చెందిన ఏడవ తరగతి విద్యార్థి విట్సన్ పాల్ ను జిల్లా విద్యాశాఖ అధికారి బి. విజయభాస్కర్ శుక్రవారం పరామర్శించారు. మారెళ్ళ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి విట్సన్ పాల్ గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఆటలు ఆడుకుంటూ జారిపడి తలకు బలమైన గాయం అయింది. అనంతరం విద్యార్థి హాస్పిటల్ చికిత్స తీసుకొని ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి ఆ బాలుడు ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో నాడు నేడు ద్వారా జరుగుతున్న పనులను పరిశీలించారు. విద్యార్థులఅభ్యసన సామర్ధ్యాలను పరిశీలించారు. విద్యార్థులు రాసిన పరీక్ష పత్రాలను సరిగా దిద్దారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి క్రికెట్ వాలీబాల్ ఆడి వారిని ఉత్తేజపరిచారు. పాఠశాలలో ఉపాధ్యాయులకు సమావేశం నిర్వహించి త్వరలో జరగబోయే పరీక్షల లో ఉత్తీర్ణత శాతం పెంచాలన్నారు. అభ్యసనా పురోగతి గురించి తీసుకోవాల్సిన చర్యల గురించి విలువైన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం పురుషోత్తమరావు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *