దేశంలోనే ఆర్థిక నేరస్తుడిగా పేరు కాస్తున్న ప్రపంచ కుబేరులలో ఒకడిగా ఉంటూ దేశ పరువు తీస్తున్న గౌతమ్ అదాని ఆస్తులను జప్తు చేసి జాతీయం చేయాలని సిపిఐ దర్శి నియోజకవర్గ కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబు అన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థలైనటువంటి ఎస్బిఐ, ఎల్ఐసి ఆదోని కంపెనీలలో 60 శాతం పైగా ఎల్ఐసి షేర్లు కొనుగోలు చేయగా, 80% పైగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు కొనుగోలు చేయడమే కాకుండా ఈ రెండు సంస్థలు కూడా 80 వేల కోట్ల పైచిలుక అదాని కంపెనీలకు అప్పుగా ఇచ్చున్నారు. పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి తన పిల్లలను చదివించుకోవడానికో అప్పు అడిగితే లోను రూపంలో అప్పు అడిగితే ఇవ్వనటువంటి బ్యాంకులు ఆదానీ, అంబానీలకు ఏ విధంగా వేల కోట్ల రూపాయలు అప్పులు ఇస్తున్నారని ప్రశ్నించారు. మరోపక్క తప్పుడు మార్గంలో ఆలోచన ఆస్తులను కూడా కట్టుకున్నాడని వేలకోట్ల రూపాయలు పన్నుల గోడుతున్నారని అదాని తీవ్రంగా నష్టపోతున్నారు. ఎంతమంది ఆర్థిక నేరస్తులను ఈ మోడీ ప్రభుత్వం కాపాడుతుందని ప్రశ్నించారు. అదేవిధంగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్ట కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రాజెక్టు మంజూరు చేయకపోవడం ఆంధ్రప్రదేశ్ అంటే ఎంత చిన్నచూపు అర్థమవుతుందన్నారు. నరేంద్ర మోడీ ఒక్క గుజరాత్ కే ప్రధానమంత్రి కాదని భారతదేశానికి ప్రధానమంత్రిని ఆయన గుర్తు చేసుకోవాలన్నారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ప్రత్యేక హోదా విభజన హామీలు కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటాలు సాధించాలని లేదంటే మీకు రానున్న రోజుల్లో ప్రజలు బాగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కోటంశెట్టి హనుమంతరావు, ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్ కరుణానిధి, సిపిఐ పట్టణ కార్యదర్శి జూపల్లి కోటేశ్వరరావు, సిపిఐ సీనియర్ నాయకులు తన్నీరు వెంకటేశ్వర్లు, రామయ్య, అరుణ, తేళ్ళ ప్రసాద్, సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు.
అదాని ఆస్తులను జప్తు చేసి జాతీయం చేయాలి-
సిపిఐ దర్శి నియోజకవర్గ కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబు
10
Feb