వైఎస్సార్సీపీ సోషల్ మీడియా తాళ్లూరు మండల కన్వీనర్లుగా బొజ్జా సజీవ్ కుమార్ ఇడమకంటి భరత్ రెడ్డిలు నియమితులైనారు. కో కన్వీనర్లుగా బొజ్జా లాజర్, కాంచన గుంట మణికంఠ, విప్లర్ల శ్రీకాంత్, కావూరి ఇస్మానియేల్, గంగవరపు శివా రెడ్డిలు నియమితులైనారు. తమకు బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి, ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్, మండల పార్టీ ఇన్చార్జి ‘మద్దిశెట్టి రవీంద్రలకు కన్వినర్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభ్యున్నతికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. సోషల్ మీడియా కన్వినర్లుగా, కో కన్వీనర్లుగా నియమితులైన వారికి పార్టీ బాధ్యులు, మండల ప్రజా ప్రతినిథులు, బంధు మిత్రులు అభినందనలు తెలిపారు.
