వ్యక్తి గత కేసులతో పాటు, అన్ని శాఖలలో కోర్టులలో పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించటానికి లోక్ అదాలత్ చక్కని వేదిక అని దర్శి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి, లోక్ అదాలత్ చైర్మన్ జీఎల్వి ప్రసాద్ అన్నారు. దర్శి కోర్టు ఆవరణలో శనివారం నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్ సివిల్ జడ్జి, లోక్ అదాలత్ చైర్మన్ జీఎల్వి ప్రసాద్ మాట్లాడుతూ మనిష హక్కులు, బాధ్యతలు తెలుసుకుని జీవితంలో ముందుకు సాగాలని కోరారు. హక్కుల కోసం అనేక సమస్యలపై కోర్టులను ఆశ్రయిస్తారని అన్నారు. అయితే ఒక్క అడుగు వెనక్కి తగ్గి పెద్ద మనుషులు, లేదా మధ్యవర్తులతో సమస్యలను పరిష్కరించుకుంటే ఇరు పక్షాల వారు నెగ్గినట్లవుతారని అన్నారు. పంతాలకు పట్టింపులకు పోయి కాలాన్ని, ధనాన్ని వృధా చేసుకోకుండా రాజీ మార్గమే రాజ మార్గంగా పనులను సులుభ తరం చేసుకోవాలని వక్తలు అన్నారు. అనంతరం ఎస్సీ జెసి పరధిలో పలు రకాల లైన ఏడు కేసులను, జె ఎఫ్ సీఎం పరధిలో 120 కేసులను పరిష్కరించారు. జూనియర్ సివిల్ జడ్జి జీ. వి. ఎల్ సరస్వతి, న్యాయ వాదులు చెన్న కేశవులు, మనోహరమ్మ, ఆదినారాయణలో పాటు పలువురు న్యాయ వాదులు, సంఘ సేవకుడు జీవి రత్నం తదితరులు పాల్గొన్నారు.
