నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి పల్నాడు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పెద్దింటి పెద్ద శేషయ్య మాదిగ, కవలకుంట్ల ప్రసాద్ మాదిగలు ఏకగ్రీవంగా ఎన్నిక

నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి పల్నాడు జిల్లా అధ్యక్షునిగా వినుకొండ మండలం, బ్రాహ్మణపల్లికి చెందిన పెద్దిటి పెద్ద శేషయ్య మాదిగను , జిల్లా ప్రధాన కార్యదర్శిగా వినుకొండ మండలం వినుకొండ ఎస్సీ కాలనీకి చెందిన కవలకుంట్ల ప్రసాద్ మాదిగను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు . వారికి నియా మాక పత్రమును సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ అందజే సారు . ప్రకాశం జిల్లా దర్శి లో శనివారం అంబేద్కర్ విగ్రహం వొద్ద నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి కార్యకర్తల సమావేశం నిర్వహించారు . పలు అంశాల పై చర్చించారు . ఈ సందర్భంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన పెద్దింటి పెద్ద శేషయ్య మాదిగ , కవలకుంట్ల ప్రసాదులు మాట్లాడుతూ .. మాపై ఎంత నమ్మకంతో పదవులు ఇచ్చిన నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగకు కృతజ్ఞతలు తెలియజేశారు. పల్నాడు జిల్లాలోని మాదిగ చర్మకారులు., డప్పు కళాకారుల సమస్యలపై అలుపు లేకుండా పోరాటం చేసి వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని తెలిపారు. జిల్లాలోని మాదిగ చర్మకారులు డప్పు కళాకారులు వారి సమస్యలను మా దృష్టికి తీసుకువచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో కర్ణపూడి ప్రసన్నకుమార్ మాదిగ, కవలకుంట్ల కిరణ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *