అద్దంకిలో జయం కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఆదివారం సచివాలయ ఉద్యోగాలకు త్వరలో జరగనున్న వ్రాత పరీక్షపై పోటీ పరీక్షలలో పాల్గొనే నిమిత్తం అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జయం కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. అవగాహన సదస్సులో ముఖ్య అతిథులుగా పశు వైద్య సహాయ శస్త్ర చికిత్సకులు డాక్టర్ ఎం. కాశి రెడ్డి, డాక్టర్ ప్రతాప్ రెడ్డిలు పాల్గొని సమగ్ర విశ్లేషణ అందిస్తారని తెలిపారు. త్వరలో రానున్న నోటిఫికేషన్లో 20 రకాల ఉద్యోగాలు పొందు పరచ బడ్డాయని అందులో డిప్లొమా, డిగ్రీ, బి- టెక్ పాస్ అయిన విద్యార్థులు అర్హలని తెలిపారు. ఈ పరీక్షలలో సిలబస్, పరీక్షా విధానంపై ఉచిత అవగాహన సదస్సులో ప్రావీణ్యులు అవగాహన కల్పిస్తారని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 9705911655 ఫోన్ నంబర్ను సంప్రదించాలని కోరారు.
అద్దంకిలో జయం కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్ పై, పరీక్షా విధానంపై ఉచిత అవగాహన సదస్సు
11
Feb