రైతులు తాము పండించిన పంటలపై ఎప్పటికప్పుడు మార్కేట్ ధరలు తెలుసుకుని తమ ఉత్పత్తులను గిట్టుబాటు ధరలకు అమ్ముకోవాలని వ్యవసాయాధికారి
ప్రసాదరావు కోరారు. తాళ్లూరులో శనివారం పలు పంటల ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. మిరప సాధారణ రకం క్వింటా రూ. 12,800 నుండి 17,500, ప్రత్యేక రకాలు రూ. 18000 నుండి 22,000 గాను, ప్రత్తి రూ. 7200 నుండి 7600 గాను, పసుపు రూ. 5,600 నుండి ఆరు వేల వరకు, మొక్కజొన్న 1900 నుండి రూ. 2200 వరకు, కందులు రూ. 6000 నుండి రూ.6,400 వరకు, మినుములు రూ. 6.200, 6500 వరకు ఉన్నాయని తెలిపారు. ధరలను గత సంవత్సరాల ధరలను విశ్లేషించి అంచనా వేయటం జరిగిందని, పంట రకం, నాణ్యత, ఎగుమతులు. దిగుమతులు, అంతర్జాతీయ ధరలను బట్టి హెచ్చు తగ్గులు ఉంటాయని చెప్పారు. విఏఏ నాగరాజు నాయక్, వెంకటరావు, సుధీర్ లు పాల్గొన్నారు.
